ఖానాపూర్‌లో ఏజీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ భవిష్య
19-06-2026 08:37 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కార్యాలయాన్ని జేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ భవిష్య ప్రారంభించారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఈ కార్యాలయాన్ని మెజిస్ట్రేట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించే ఏజీపీ కార్యాలయం సమర్థవంతంగా పనిచేసే ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు.






