19 June, 2026 | 9:47 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్   •   విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ   •   ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్   •   ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా   •   వర్షాలు కురవాలని కోరుతూ... అల్లిపూర్ లో కప్పతల్లి ఆట   •   రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన   •   అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్   •   పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి   •   మేడిపల్లికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

జప్తి జనకంపల్లి గ్రామంలో సామాజిక అక్షరాభ్యాసం

19-06-2026 08:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఫ్రీ ప్రైమరీ స్కూల్ నూతన విద్యార్థులకు సామాజిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎంపీ.యుపిఎస్ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు గ్రామ సర్పంచ్ వర్షిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి వర్షిని మాట్లాడుతూ... గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లి మంచి భవిష్యత్తును పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సదుపాయాలు సౌకర్యాలు అందజేస్తుంది. కనుక గ్రామంలోని విద్యార్థులు ప్రవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోకి పంపాలన్నారు.