5 June, 2026 | 2:42 AM

హైడ్రా ఎక్కడ..?

05-06-2026 12:00 AM
  1. అక్రమార్కుల చెరలో పీరం చెరువు..! 
  2. సూత్రధారులు పాత్రధారులు టౌన్ ప్లానింగ్ అధికారులే..! 
  3. మంత్రులు, ఎమ్మెల్సీల పేరుతో అక్రమ నిర్మాణాలు
  4. గతంలో ఓ అవినీతి తిమింగలం ఇచ్చిన పత్రాలతో 
  5. చెరువులో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
  6. 34 .29 ఎకరాల ఎఫ్‌టీఎల్‌లో అక్రమాలు ఎన్నో..?
  7. చెరువులో నాలాను మింగేస్తున్న బిల్డర్లు..

రాజేంద్రనగర్ జూన్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు చెరువులు నాళాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వైపు హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్న తమను ఎవరు ఏమి చెయ్యలేరు అనే ధీమాతో అక్రమ నిర్మాణాలపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పిరం చెరువు పై కొందరు అక్రమార్కుల కన్ను పడింది.

చెరువు సమీపంలోని ఎఫ్టిఎల్ లో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నట్లు ఆరో పణలు గుప్పమంటున్నాయి. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవినీతి ప్రబు ద్ధుడు  చెరువు ఎఫ్‌టిఎల్‌పై తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతోనే అదే అ దునుగా తీసుకున్న కొందరు అక్రమార్కులు చెరువులో పాగా వేస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీబిల్  సిటీ కి వెళ్లే రోడ్డు వెంట కొనసాగుతున్న నిర్మాణాలపై పలువురికి పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయని చెరువు ఎఫ్‌టిఎల్ భారీ అపార్ట్మెంట్‌లను నిర్మిస్తూన్నరని బాహాటంగా విమర్శిస్తున్నారు.

ముమ్మాటికి ఇవి అక్రమ నిర్మాణలే నని పిరం చెరువు గ్రామ పంచాయతీ ప్రజలు చెబుతున్నారు. ఎఫ్‌టిఎల్‌లో ఎలాం టి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో అధికారులు చెరువులో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం కొందరు తొలగించి అక్కడే నిర్మాణాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామ రెవిన్యూ రికార్డుల ప్రకారం చెరువు 34.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కొంతమంది బారి అపార్ట్మెంట్ లను నిర్మిస్తూ ఒక్కో ఎస్‌ఎఫ్‌టికి రూ.5,500 నుండి 6వేలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు.

కొంతమంది బిల్డర్లు పథకం ప్రకారం మంత్రులు ఎమ్మెల్సీల పేర్లు చెప్పి వాళ్ళ బంధువులము అంటూ అదేచ్ఛగా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణాలపై కూడా మంత్రులు ఎమ్మెల్యేల పేర్లను వాడేస్తున్నారు  టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఈ అక్రమ నిర్మాణాలపై ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు మరి ఈ వ్యవహారం మొత్తం కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల సలహాలతోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎవరైనా అక్రమ నిర్మాణాలపై గట్టిగా అధికారులను ప్రశ్నిస్తే ఆ బిల్డింగు పలానా మంత్రి, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ బంధువులది అంటూ బదులిస్తున్నారు. చెరువు సమీపంలో భారీ అపా ర్ట్మెంట్లను నిర్మిస్తున్న బిల్డర్లు చెరువులోకి వరద నీరు వచ్చే నాళాలను సైతం వదలడం లేదు నాలాలను  కబ్జా చేసి బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు మరి ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు సంబంధిత బిల్డర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి..? ఈ తతంగం వెనుక లావాదేవీల సంగతి బహిర్గతం కావాలి అంటే ఏసీబీ విజిలెన్స్ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేయాలి.

స్పందించని గండి పేట తహసీల్దార్..

పీరం చెరువు ఎఫ్‌టీఎల్ మరియు కబ్జాలపై వివరణ కోరేందుకు గండి పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి పలుమార్లు ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు

హైడ్రా, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి

పీరం చెరువులో విచ్చల విడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇరిగేషన్ శాఖల అధికారుల తో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికా రులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. హైడ్రా అధికారులు పిరం చెరువు ఎఫ్ టి ఎల్ స్థలం కాపాడేందుకు కంచె ఏర్పాటు చేయాలని బండ్లగూడ బిజెపి అధ్యక్షుడు కొండె మహేష్ యాదవ్ కోరారు.

కొండె మహేష్ యాదవ్, 

బండ్లగూడ బీజేపీ అధ్యక్షుడు