5 June, 2026 | 1:08 AM

పేదల కలలపై పిడుగు!

05-06-2026 12:00 AM
  1. భూముల ధరల పెంపుతో అదనపు భారం
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఖజానాకు లాభదాయకమై ఉండవ చ్చు కానీ సామాన్య ప్రజలకు, సొంత ఇంటి కలతో జీవిస్తున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది మరో పెద్ద ఆర్థిక దెబ్బ అని టీఆర్పీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. వ్య వసాయ భూములపై 2.75%, గ్రామీ ణ ప్రాంతాల ఓపెన్ ప్లాట్లు 78%, హైదరాబాద్ పరిసర ఓపెన్ ప్లాట్లు 100% వరకు, కొన్ని ప్రాంతాల్లో 500% వరకు పెంచారని చెప్పారు.

భూముల విలు వ పెరిగితే రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు నేరుగా పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందన్నారు. కా నీ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం ఉండదని చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబం రూ.30 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేస్తుందనుకుంటే  కొత్త విలువ ప్రకారం 45 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదనంగా స్టాంప్ డ్యూటీ (4%) రూ.1.80 లక్షల కు పెరగడంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెరుగుతుందన్నారు.

తెలంగాణలో 2021 జనాభా లెక్కలు, ఎన్‌ఎస్‌ఎస్‌వో, ఎన్‌ఎఫ్‌హెచ్ వంటి అధ్యయ నాల ప్రకారం లక్షలాది కుటుంబాలకు సొం త ఇల్లు లేదన్నారు. రేట్లు పెంచడం వల్ల పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల భూముల విలువ పెరుగుతుందని, పెద్ద భూ స్వాముల ఆస్తి విలువ పెరుగుతుందన్నారు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెపుతూనే మరోవైపు స్థలాల రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికే తీవ్ర ధనికు లైన 10% వద్దే అత్యధిక భూములు ఉన్నాయన్నారు. 

ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి?

100 గజాల వరకు ఉన్న స్థలాలకు పెం పు రద్దు చేయాలి. మొదటిసారి ఇల్లు కొనేవారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ రాయితీలు ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ ఊహాజనిత ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. పట్టణ పేదల కోసం భూమి బ్యాంక్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.