4 March, 2026 | 2:42 PM

గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి

04-03-2026 12:00 AM

పెద్దపల్లి, మార్చి 3 (విజయ క్రాంతి) రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ లోని అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గోలివాడ, గోదావరిఖని 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని గోదావరి పుష్కర ఘాట్లను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరాలు ఏర్పాట కోసం తీసుకుంటున్న చర్యల ఏర్పాట్ల పై పూర్తిస్థాయి కార్యచరణ రూపొందించాలని పలు సూచనలు చేశారు.

గోదావరి తీరంలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి అవకాశం ఉందని ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, బ్యారికేడింగ్, సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు వంటి అంశాలను డీసీపీ  సవివరంగా పరిశీలించారు.ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు,  చిన్నారులు పుష్కర స్నానాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, 

అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్, ఘాట్ పరిసరాల్లో శుభ్రత, భక్తులు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో పుష్కర ఘాట్లను వినియోగించుకునేలా అన్ని శాఖల సమన్వయం తో సమగ్ర ప్రణాళిక రూపొందించి పని చేయాలని అధికారులకు డీసీపీ  స్పష్టం చేశారు.డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్,  గోదావరిఖని 2- టౌన్ సీఐ ప్రసాద్ రావు, అంతర్గం ఎస్‌ఐ వెంకట్   పాల్గొన్నారు.