22 August, 2026 | 4:36 PM

నల్గొండ ఘటనకు నిరసనగా శాంతి ర్యాలీ

22-08-2026 12:00 AM

ఉపాధ్యాయుల భద్రత, పిల్లల పర్యవేక్షణపై ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల పిలుపు

మేడ్చల్ అర్బన్ ఆగస్టు 21(విజయక్రా ంతి): నల్గొండ జిల్లాలోని నాగార్జున హైస్కూ ల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా నిరసిస్తూ మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సం ఘం ఆధ్వర్యంలో పాఠశాలలను బంద్ నిర్వహించి ‘శాంతి ర్యాలీ‘ కార్యక్రమాన్ని నిర్వ హించారు. అనంతరం స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మ గాంధీ వి గ్రహాలకు పూల మాలలు వేసి హాతురాలైన రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళలను అర్పించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అధిపతులు మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వాడకంపై కటిన పర్యవేక్షణ,పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, వారు ఏం చూస్తున్నారో దగ్గరుండి గమనించాలని సూచిస్తూ మొబైల్ ఫోన్ దుర్వినియోగం కాకుండా చూసుకోవడం తల్లిదం డ్రులు బాధ్యతగా చూడాలని వారు డిమాం డ్ చేశారు.

అదేవిధంగా మానసిక ఒత్తిడికి ప రిష్కారం, పిల్లలపై అతి ప్రేమ చూపించి నెత్తినెక్కించుకోకూడదు,వారిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రు లు మనసువిప్పి మాట్లాడని చెప్పారు.పిల్లల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలని మేడ్చల్ ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాల సంఘం స్పష్టం చేశారు.ఉపాధ్యాయు ల్లో పెరుగుతున్న అభద్రతాభావం ,నవసమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులు నేడు తీవ్ర అభద్రతాభావాల్లోకి వెళ్లిపోతున్నారని వారు వెల్లడించారు.

అంతేకాకుండా పిటిఎం ద్వారా నిరంతర పర్యవేక్షణ పాఠశాలల్లో పిల్లల భవిష్యత్తుకు పునాదులు పడతాయి కాబట్టి రోజువారీగా లేదా వారానికొకసారి లేదా నెలకొకసారి జరిగే పేరెంట్-టీచర్ మీ టింగ్‌లలో పాల్గొని పిల్లల నడవడికపై పాఠశాలల యాజమాన్యాలతో చర్చించాలని వా రు తల్లి దండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలు సంఘం జి ల్లా కోశాధికారి గిరిబాబు.మండల ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ.కోశాధికారి జి.ఎల్.వి నారాయణ మూర్తి, ఉపాధ్యక్షులు లవకుమా ర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయ ణ, సత్యనారాయణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యు లు, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.