రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ సమావేశం
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో మహేశ్ గౌడ్ సమావేశమయ్యారు. మహేశ్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాహుల్ కు వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పార్టీ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను రాహుల్ కు వివరించారు.
డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్ఏ నియామకాలపై రాహుల్ తో చర్చించారు. కులగణన అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్లు మహేశ్ గౌడ్ రాహుల్ గాంధీకి వివరించారు. మహిళ రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్ల జోడించాలని మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ జాతీయ ఓబీసీ సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని మహేశ్ గౌడ్ రాహుల్ ను కోరారు. మహేశ్ గౌడ్ విజ్ఞప్తిపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు.






