3 June, 2026 | 1:27 AM

బీజేపీకి పవన్ ‘ సీ ’ టీమ్ జత అయ్యాడు

03-06-2026 12:00 AM
  1. నవ నిర్మాణం పేరుతో డ్రామాలాడొద్దు 
  2. ప్రభుత్వ విప్ వేముల వీరేశం 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) :  తెలంగాణ నవ నిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ ఆడుతున్న డ్రామాలు ఆపాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం హెచ్చరించారు. రాష్ట్రం వచ్చిందన్న సంతోషంలో తెలంగాణ ప్రజలుంటే.. పవన్ కల్యాణ్ 11 రోజులు నిరహార దీక్ష చేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా పనిచేస్తుంటే,ఇప్పుడు పవన్ సీ టీమ్‌గా జత అయ్యారని ఆయన విమర్శించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కంటే .. ముందుగా నీ రాష్ట్రం రాజధాని నిర్మించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని విమర్శించారు.