3 June, 2026 | 2:07 AM

ఉపాధి కూలీల్లో.. ఆవిర్భావ స్ఫూర్తి

03-06-2026 12:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అంతటా ఘనంగా నిర్వహించగా, ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనుల వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించి ఆవిర్భావ స్ఫూర్తిని చాటుకున్నారు. ఉపాధి పనులు నిర్వహించే చోట జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కూలీలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ యువత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.