పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన
దమ్మపేట,(విజయక్రాంతి): పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్లే కార్దులతో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్, సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాద్యక్శలు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో మూడి చమురులు ధరలు తగ్గుతున్నా గానీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను పెంచి వాహనరంగంపై, సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రజల జేబులు ఖాళి చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వము ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ పై 3 రూపాయలు డీజిల్ పై 3 రూపాలు పెంచిందని, పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచడం మూలంగా రవాణా రంగం ఆటో, ట్రాలీ, క్యాబ్, డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులు అదాని, అంబానీ కొరకు 4 లేబర్ కోడ్స్ ను అమలు చేసి కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు.
వెంటనే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల వందమంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కారు ట్రావెల్స్ , ఆటో, ట్రాక్టర్ , లారీ వాహనాలకు గిరాకి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో ములిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ధరలు పెంచడం అన్యాయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






