8 July, 2026 | 5:22 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి   •   ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే   •   పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ   •   ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •  

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

06-05-2026 01:56 AM

అలంపూర్ ఏప్రిల్ 5: గత నెల 27న వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను డీసీఎం ఢీకొన్న ఘటనలో వడ్డేపల్లి మండలం కోవెలదిన్నె గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తిక్కారెడ్డి, కృష్ణారెడ్డి చంద్రమోహన్ రెడ్డి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు నరసింహ గౌడ్ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.దీంతో కోవెలదిన్నె గ్రామంలో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే.

విషయం తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు బాధిత కుటుంబాలను  మంగళవారం పరామర్శించారు. ప్రమాదంకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని నింపారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.