30 July, 2026 | 9:04 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి

29-05-2026 12:02 AM

కూకట్‌పల్లి, మే 28, (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా రామయ్య పల్లికి చెందిన ఉమ్మల్ల మల్లయ్య (55)గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ కోసం  ఈనెల 26వ తారీకు న కూకట్పల్లి లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేరాడు.

పరేషన్ అనంతరం తీవ్రంగా కడుపునొప్పి వస్తుందని పలుమార్లు ఆసుపత్రి వైద్యులకు తెలిపిన వైద్యులు నిర్లక్ష్యంతో ఆపరేషన్ అనంతరం అలాగే ఉంటుందని సమాధానం ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నొప్పితో బాధపడుతున్న మల్ల య్య గురువారం ఉదయం ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మల్లయ్య మృతి చెందాడని కూకట్పల్లి పోలీసులకు మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.