30 July, 2026 | 10:00 PM

ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

30-07-2026 08:57 PM

ప్రజలకు ఇబ్బంది కలిగించే అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు చాలాచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి, విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉట్నూర్ ఐబీ నుండి బస్టాండ్ వెళ్ళు దారిలో ప్రతి వర్షాకాలం తలెత్తే సమస్యకు బ్రిడ్జికి నాలకు అడ్డుగా నిర్మించి ఉన్న పురాతన అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.

నాలలో పేరుకుపోయిన చెత్తను జేసీపీ తొలగించారు. దీంతో వరద నీరు సరఫరా అయ్యేలా చేశారు. ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడుతూ మెయిన్ రోడ్డు పైన నీటి ప్రవాహానికి అడ్డుగా అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఆయన తో పాటు ఐటీడీఏ పీవో మంద మకరందు,  ఆర్డీవో రాథోడ్ మోహన్ మోహన్ సింగ్ ఎమ్మార్వో రఘునాథరావు,పోలీస్ అధికారులు,తదితరులు ఉన్నారు.