30 July, 2026 | 9:59 PM

అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

30-07-2026 08:49 PM

- త్వరలో మెరిట్ ఆధారంగా ఎంపికలు

- సీడీపీఓ హేమభార్గవి

నర్సాపూర్: నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రెండు రోజుల పాటువిజయవంతం గా నిర్వహించినట్లు సీడీపీఓ హేమభార్గవి తెలిపారు. టీచర్ల 23 ఖాళీలకు 344 మంది, ఆయాల 56 ఖాళీలకు 188 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపడతామని ఆమె తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.