30 July, 2026 | 9:59 PM

ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్

30-07-2026 08:47 PM

500 మొక్కలు నాటిన కమిటీ సభ్యులు

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెంలో ఘనంగా ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోను సూద్ జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలో గల రైల్వే స్టేషన్ పరిసరాల్లో, భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు ఎస్.కె. సత్తార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సోను సూద్ పుట్టినరోజున పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.