27 April, 2026 | 9:42 PM

బీరోలు పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదం తృటిలో తప్పింది

27-04-2026 08:00 PM

కనిపించని వైర్‌తో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

 బంక్ యజమాని నిర్లక్ష్యంపై ఆగ్రహం

 చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పింది.. పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అడ్డుగా కట్టిన తాడు ఓ వ్యక్తి ప్రాణాలు తీసే ప్రమాదం నుంచి రెప్పపాటులో ప్రాణం మిగిలింది. ఈ సంఘటన తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గత రెండు రోజులుగా బంక్ లలో పెట్రోల్, డీజిల్ కొరత రావడంతో బీరోలు గ్రామంలోని బంక్ యజమాని, సిబ్బంది నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేసి అడ్డంగా ఓ తాడు కట్టారు.

పెట్రోల్ బంక్ యజమాని, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ చైనా తాడును అడ్డంగా కట్టారు.  అయితే రాత్రి సమయంలో నందిపాటి ఉపేందర్ దమ్మాయిగూడెం నుంచి బీరోలుకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా పెట్రోల్ కోసం బంక్ లోకి వెళ్తుండగా అడ్డంగా కట్టిన ఆ వైర్ స్పష్టంగా కనిపించకపోవడంతో వైర్ మెడకు తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే కిందపడిపోగా, గొంతు కోసుకుని రక్తస్రావం అయ్యింది. దీంతో స్థానికులు అతన్ని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పెట్రోలు బంకు యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు తిరుమలాయపాలెం పోలీస్  స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.