19 April, 2026 | 2:14 AM

పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా

19-04-2026 12:23 AM

లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. దీంతో జనవరిలో మొదలైన బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినట్లయింది. సెషన్‌కు కొనసాగింపుగా ఈ నెల ౧౬ నుంచి ౧౮ వరకు మూడురోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక సమావేశాలుకూ తెరపడినట్లయింది.

శనివారం ఉదయం ౧౧ గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఓం బిర్లా సమావేశ వివరాలను వెల్లడించి, అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత, రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ సీపీ రాధాకృష్ణణ్ తెలిపారు. ఈ సెషన్‌లో సుమారు 157 గంటల 40 నిమిషాల పాటు సమావేశాలు సాగాయని, ప్రొడక్టివిటీ సుమారు 110 శాతం సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు.