1 June, 2026 | 1:16 AM

విద్యార్థుల పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త

01-06-2026 12:00 AM

ఘట్‌కేసర్, మే 31 (విజయక్రాంతి) : వ్యాపారమే ధ్యేయంగా వీధికొక్కటి వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలల మాయాజాలం లో పడకుండా విధ్యార్థుల తల్లిదండ్రులు త గు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు విధ్యావేత్తలు కోరుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం తో నేడు విద్య వ్యాపారంగా మారింది. ఎటుచూసినా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగు ల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని నియంత్రించే అధికార యంత్రాంగం లేకపోవడం, ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రైవే టు పాఠశాలల వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది.

అర్హత లేని ఉపాధ్యాయులు, అరకొర వసతులతో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు విధ్యార్థుల తల్లిదండ్రులకు అరచేతి లో స్వర్గం చూపిస్తున్నారు . అదే నిజమని న మ్మిన తల్లిదండ్రులు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా, ఆ పాఠశాలల్లో విధ్యా భో దన ఎలా ఉంది, మౌళిక వసతులు ఎలా ఉ న్నాయి. అవేవి చూడకుండా ఆపాఠశాలల పేర్లపైన ఆడoబరాలు చూసి తమపిల్లలను చేర్పిస్తున్నారు. ఇలా ప్రైవేటు పాఠశాలల మాయాజాలంతో తమ పిల్లలను చేర్పించి.

అనంతరం అనుమతులు లేక ఆ పాఠశాలలు ఎత్తివేయడంతో సంబంధిత దృవప్ర తాలు అందక ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి. పై చదువుల నిమిత్తమో లేదా ఉద్యోగ అవకాశాల నిమిత్తమో సరైన దృవపత్రాలు లేక వాటికోసం విధ్యార్థుల తల్లిదండ్రులు ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయ డం చూస్తూనే ఉన్నాము.

అందుకే అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తమ పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం స్థానికత కోసం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు ఉద్యోగాలకు, పై చదువుల నిమిత్తం తప్పని సరిగా సమర్పించాలని లేదంటే స్థానికతకు అనర్హుడుగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. సేవా దృక్పథంతో అందించాల్సిన విద్య నేడు శ్రమిస్తే తప్ప అందడంలేదు.