1 June, 2026 | 2:06 AM

బీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత

01-06-2026 12:00 AM
  1. అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యమకారులు
  2. రాగిడి లక్ష్మారెడ్డి ముందే రసాభాస

మేడ్చల్ అర్బన్ మే 31(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని శ్రీ గార్డెన్ లో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమో దు పై అవగాహన సదస్సులో తీవ్ర ఉద్రిక్త నెలకొంది.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సభ్యత్వ నమోదు ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి కళ్ళముందే బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమకారులకు మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  భాగంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఉద్యమకారుల ఫొటోలు లేవని సమావేశ మందిరంలో ఒక్క ఉద్యమకారు న్ని ఆహ్వానించలేదని ఎందుకు ఉద్యమకారులకు అర్హత లేదని సభ్యత్వ నమోదు ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి ముందే ప్రశ్నించారు.కండువాలు మార్చిన నాయకులకు ఉన్నటువంటి గుర్తింపు ఉద్యమకారులకు లేదా అంటూ ఉద్యకారులు సంజీవరావు,ప్రవీణ్ కుమార్ లు నిలదీశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పాల్గొన్న మమ్ములను ఎందుకు గుర్తిస్తలేరని ఉద్యమకారులు మండిపడ్డారు.రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్పిన సిద్ధాంతాలకు కట్టుబడి బిఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పనిచేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సైతం ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇళ్ల స్థలాలను ఉద్యమకారులకు ఇస్తామని కమిటీ వేశారని నాగుర్ల సంజీవరావు వ్యాఖ్యానించారు.

మాకు బిఆర్‌ఎస్ పార్టీ మీద ఎలాంటి కోపం లేదని కేవలం నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని ఉద్యకారులు తెలియజేశారు.ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని రావల్ కోల్ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ ఏర్పాటు అడ్డుకొనుటకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడితే స్థానిక ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి చూసి కూడా మా వద్దకు రాలేదని రావల్ కోల్ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సమావేశంలో నిలదీశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇం చార్జి చామకూర మహేందర్ రెడ్డి, అధ్యక్షులు బాసురాది భాస్కర్ యాదవ్, సీనియర్ నా యకులు శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, దయాననంద్, యాదవ్, భద్రారెడ్డి, మాజి కో ఆప్ష న్ సభ్యులు నవీన్ రెడ్డి, కౌన్సిలర్‌లు, మాజి సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.