20 April, 2026 | 8:34 AM

శాసనమండలి చైర్మన్‌ను సన్మానించిన పల్లపు బుద్ధుడు

20-04-2026 12:00 AM

చిట్యాల, ఏప్రిల్ 19: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లపు బుధుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఆదివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన స్వగృహం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లపు బుద్ధుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ఇటీవల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తీసుకొచ్చిన అయ్యప్ప స్వామి వారి మహాప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి,వార్డ్ మెంబర్లు జన్నపాల శ్రీను, ఎలిమినేటి హరిప్రసాద్ రెడ్డి, మేడబోయిన శ్రీను, కురపాటి లింగయ్య, మర్రి రమేష్, గంగాపురం వెంకటేశం, గోపగోని సత్తయ్య మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.