20 April, 2026 | 7:17 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

20-04-2026 12:00 AM

మోతె, ఏప్రిల్ 19: ఆర్. కె. ఎల్. కె డిగ్రీ కళాశాలలో 30 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 30 సంవత్సరాలు క్రితం కళాశాలలో గడిపిన ఆనాటి రోజులను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు.

వివిధ హోదాలో స్థిరపడిన విద్యార్థిని విద్యార్థులు కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అజిత్, గిరి, ఉష, సుష్మ, గురునాథం, శ్రీధర్, నరసింహారావు, శంకర్, రఘు, సుధీర్, రవి,రమేష్, సునీత, శశికళ, విద్య, రజిత, విజయ తదితరులు పాల్గొన్నారు.