30 May, 2026 | 9:40 PM

టీయువి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు

30-05-2026 08:36 PM

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పల్లపు బుద్ధుడు ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ నియామక పత్రాన్ని శనివారం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను సంఘటితం చేయడానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి, సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని బాధ్యతలను అప్పగిస్తూ ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యమకారుల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేసి సంస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, గౌరవం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.