27 April, 2026 | 3:50 AM

పాకిస్థాన్ పర్యటన రద్దు

27-04-2026 02:08 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ నిర్ణయం

టైం వేస్ట్ అంటూ.. చర్చలను కొట్టిపడేసిన వైనం

వాషింగ్టన్, ఏప్రిల్ ౨౬: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణ యం తీసుకున్నారు. తమ ప్రతినిధుల పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేశారు. ఇరాన్‌తో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభా వం చూపనుంది. 18 గంటల సుదీ ర్ఘ ప్రయా ణం చేసి అక్కడికి వెళ్ల డం సమయం వృథా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు చర్చలు జరపాలను కుంటే ఎవరైనా తనకు నేరుగా కాల్ చే యవచ్చని ముక్తాయించారు. ఇరాన్ నాయ కత్వంలో తీవ్ర గందరగోళం ఉందని ఎద్దేవా చేశారు.

వారి ప్రభుత్వంలో ఎవరి మాట ఎవరు వింటున్నారో తెలియ డం లేదని విమర్శించారు. శాంతి చర్చలకు అమెరికా అలవిగాని డిమాండ్లు పెడుతున్నదని ఇరాన్ చెబుతుండగా, అమెరికా ఆ విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో హోర్ము జ్ జలసంధి తోపాటు ఇరాన్‌లోని ఓడరేవుల వద్ద ఉద్రిక్తలు పెరుగుతాయని, ఆ ప్రభావం అంత ర్జాతీయ మార్కెట్‌పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు, గ్యాస్, ఎరు వుల రవా ణాపై మరిన్ని ఆంక్షలు వచ్చే అవకాశం ఉం టుందని అభిప్రాయపడుతున్నారు.