అణుశక్తిలో మరో ముందడుగు
స్వదేశీ పరిజ్ఞానంతో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిర్మాణం
భారత్ చరిత్రలోనే మైలురాయి
133వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అణుశక్తి పరిశోధనల్లో భారత్ మరో ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దేశ దీర్ఘకాలిక అణు వ్యూహంలో ఓ మూలస్తంభ మని, ఈ విషయంలో మన అణు శాస్త్రవేత్తలు విజయం సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారని తెలిపారు.
ఆదివారం మన్ కీ బాత్ 133వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం విశేషమన్నారు. పౌర అణు కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు మరిం త ముందుకు తీసుకువెళ్తున్నారని.. వారి కృషి దేశ నిర్మాణానికి గణనీయమైన తో డ్పాటు అందిస్తోందని చెప్పారు. మరోవైపు పవన శక్తి ఉత్పత్తిలోనూ భారత్ చరిత్రలో మరో మైలురాయి దాటిందని చెప్పారు. దే శం ముందుకు వెళ్లాలంటే సౌర, పవన శక్తు లు చాలా ముఖ్యమన్నారు.
పునరుత్పాదక విద్యుత్తు వల్ల భవిష్యత్ భద్రంగా ఉంటుందన్నారు. పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపం చంలోనే నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 56 గిగావా ట్లకు పైగా పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 6 గిగావాట్ల పవన శక్తి అదనంగా ఉత్పత్తి అవుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని.. పౌరులందరిదీ అని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇం దులో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజల నుంచి సేకరించిన సమాచా రాన్ని పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. భారత జనాభా లెక్కల ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నట్లు వివరించారు. సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. తమ సమాచారాన్ని స్వ యంగా నమోదు చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇస్తున్నట్లు తెలిపారు.






