ఏడుగురిని అనర్హులుగా ప్రకటించాలి
రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వినతి
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 26: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరినందున వారిని అనర్హులుగా ప్రక టించాలని రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి) సీపీ రాధాకృష్ణన్‌కు ఆదివారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆప్ నుంచి రాజ్యసభలోకి అడుగుపె ట్టిన ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలో వారి సభ్యత్వాలను రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవాది కపిల్ సిబల్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారితో సహా పలువురు రాజ్యాంగ నిపుణులను కూ డా సంప్రదించామని, చట్టప్రకారం ఆ ఎంపీ లు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కాగా బీజేపీలో చేరనున్న ఆప్ ఎంపీ ల్లో ఒకరైన ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం భద్రతను ఉపంసహరించుకుంది. 10మంది పోలీసులతో కూడిన సెక్యూరిటీని తొలగించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జలంధర్‌లోని ఛోటీ బారాదరీ ఆయన నివాస ప్రాంతంలో సీర్పీఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీలోకి హర్బ జన్ వెళ్లడాన్ని ఆప్ కార్యకర్తలు నిరసిస్తూ నివాసం వద్ద ఆందోళనలు చేపట్టారు.






