17 July, 2026 | 7:46 PM

గ్రంధాలయ శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి

17-07-2026 07:35 PM

చండ్రుగొండ,(విజయక్రాంతి): మండల పరిధిలోని తుంగారం గ్రామపంచాయతీలో రూ 5 లక్షల సిసి రోడ్డు, చండ్రుగొండ బస్టాండ్ మరమ్మత్తుల అనంతరం  పునర్ ప్రారంభం, రూ 35 లక్షల వ్యయంతో  గ్రంథాలయం శంకుస్థాపన  రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి  శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రంధాలయానికి  ప్రతి ఒక్కరూ మంచి పుస్తకం తీసుకురావాలని, అభివృద్ధికి తోడ్పడాలని, సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు ను నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఐటీడీఏ పీవో రాహుల్, సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ, కాంగ్రెస్ మండల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.