పద్మశాలీ మండల కమిటీ ఏకగ్రీవం
17-08-2026 12:13 AM
కామారెడ్డి, ఆగస్టు 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీ వంగా ఎన్నికైన అందే గణేష్ ను ఆదివారం కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. కార్యక్ర మంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరి గాధ లక్ష్మీ నరసింహులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కోశాధికారి ధర్మపురి, డివిజన్ అధ్యక్షుడు మచ్చేందర్, సంఘం జిల్లా ఎన్నికల కన్వీనర్, న్యాయవాది జగన్నాథం, కో కన్వీనర్ ,న్యాయవాది సిద్ధరాములు, కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు ఉన్నారు.






