10 May, 2026 | 7:01 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పద్మశాలి కల్యాణ మండపం పునఃప్రారంభం

27-02-2026 12:00 AM

ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సికింద్రాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశాలి సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి నెహ్రునగర్‌లో పున రుద్ధరించిన పద్మశాలి కళ్యాణ మండ పం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆధునిక హం గులతో కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించి పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలోప్రత్యేక ఆహ్వానితులు మాజీ పార్లమెంటు సభ్యుడు రాపో లు ఆనంద భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగటియ స్వామి, అఖిల భారత పద్మశాలి అన్నసత్రం మార్గదర్శకులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు చిలువేరు కాశీనాథ్, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి, పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్, మాజీ చైర్మన్, అడ్వైజరీ మెంబర్ గుత్తికొండ పాండు, పద్మశాలి-సేవా సమాజం మాజీ ట్రస్టీ,

సలహా సభ్యుడు, పులిజాల రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మహంకాళి జిల్లా బీజేపీ నేత భరత్ గౌడ్, పద్మశాలి కళ్యాణ మండపం చైర్మన్ నోముల రామ్ ప్రకాష్, వైస్ చైర్మన్ సంగిశెట్టి రవికుమార్, జనరల్ సెక్రటరీ గుత్తికొండ రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎడమ్ శ్రీనివాస్, ట్రెజరర్ గంజి శ్రీనివాస్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.