10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దివ్యా డీపీఎస్‌కేఎం కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభం

27-02-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్, చింత ల్, జీడిమెట్లలో ఉన్న ఎస్‌వీ మోడల్ హై స్కూల్ ప్రాంగణంలో బుధవారం దివ్యా డీ పీఎస్‌కేఎం కిక్ బాక్సింగ్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సమక్షంలో విజయవంతంగా జరిగిం ది. ఈ అకాడమీకి మార్గదర్శకత్వం వహిస్తున్న కిక్ బాక్సింగ్ స్థానకులు ఎస్‌కే ము జాహిద్ తెలంగాణ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న అధికారిక కోచ్. 3వ డాన్ బ్లాక్ బెల్ట్ డిగ్రీ కలిగిన ప్రొఫెషనల్ మాస్టర్‌గా ఆయన భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడేలా చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు.

బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, కుంగ్ ఫూ, తైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్, వెపన్స్ ట్రైనింగ్, ఈత ద్వారా స్టామినా పెంపు వంటి విభాగాల్లో ఉన్నత స్థాయి శిక్షణ అందిస్తున్నారు. మాస్టర్ ఎస్‌కే ముజాహిద్ శిక్షణలో తయారైన సబ్ కోచ్‌లు దారపురెడ్డి శ్రావణి, శిల్పిశెట్టి ప్రవళ్లిక మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు డబ్ల్యూఏకేఓ ఇండియా సర్టిఫైడ్ 1వ డాన్ బ్లాక్ బెల్ట్ డిగ్రీ హోల్డర్స్‌గాప్రొఫెషనల్ అనుభవంతో మహిళలకు మరియు బాలికలకు కిక్‌బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందిస్తున్నారు.

ఈ అకాడమీకి తరగతులు నిర్వహిం చేందుకు అనుమతి ఇచ్చిన ఎస్‌వీ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ ముం తాజ్ అలికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సబ్ కోచ్‌లు,తల్లిదండ్రులు, ప్రత్యేక అతిథులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ క్లబ్ ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయా రు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.