17 May, 2026 | 7:14 PM

మే 25న పద్మ అవార్డుల ప్రదానోత్సవం

17-05-2026 05:58 PM

న్యూఢిల్లీ:  దేశంలోనే అత్యున్నత పౌర పురస్కార ప్రదానోత్సవం ముహూర్తం ఖరారైంది. పౌర పురస్కార ప్రదానోత్సవం మే 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది.  2026వ సంవత్సరానికి సంబంధించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. వివిధ రంగాలలో దేశానికి విశేష సేవలందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఈ ఏదాడి 131 మందిని పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు. సహజ సేవ, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం-పరిశ్రమలు వంటి విభిన్న రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవం దక్కింది.