17 May, 2026 | 6:38 PM

అబుదాబిలోని అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి

17-05-2026 05:38 PM

అబుదాబి: అబుదాబిలోని అణు విద్యుత్ కేంద్రంలో ఆదివారం డ్రోన్ దాడులు జరిగాయని, దీంతో మంటలు చెలరేగాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. అల్ ధఫ్రాలోని బరకా అణు విద్యుత్ కేంద్రం పరిధిలో ఉన్న బాహ్య విద్యుత్ జనరేటర్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ దాడులతో ఎలాంటి ప్రాణనష్టం గాని, అలాగే రేడియోలాజికల్ భద్రతా స్థాయిలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొన్నారు. డ్రోన్ దాడికి తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదని, ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ అయిన వియన్నా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ, ఈ విషయంపై వ్యాఖ్యానించమని కోరగా వెంటనే స్పందించలేదు.

ఇరాన్ యుద్ధంలో నాలుగు రియాక్టర్లు కలిగిన బరకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ రియాక్టర్ అబుదాబికి అత్యంత పశ్చిమాన ఉన్న ఎడారి ప్రాంతంలో, సౌదీ అరేబియా సరిహద్దుకు సమీపంలో ఉంది. 20 బిలియన్ డాలర్ల విలువైన బరకా అణు విద్యుత్ కేంద్రాన్ని ఎమిరేట్స్, దక్షిణ కొరియా సహాయంతో నిర్మించబడింది. అరేబియా ద్వీపకల్పంలో ఇదే మొట్టమొదటి, ఏకైక అణు విద్యుత్ కేంద్రం 2020లో కార్యకలాపాలను ప్రారంభించింది.