8 July, 2026 | 4:37 AM

రెవెన్యూ ఆఫీసులకు సొంత భవనాలు

08-07-2026 01:46 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివా స్‌రెడ్డి తెలిపారు.  మంగళవారం అధికారులతో  సమీక్షించారు.

తొలి విడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యా లయాలకు రూ.263 కోట్లతో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రూ.97 కోట్లతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కా ర్యాలయాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.