15 June, 2026 | 3:01 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన

06-04-2026 01:16 AM

గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శివనగర్‌లోని రామాలయ కళ్యా ణ మండపంలో  నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థుల్లో అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. నిరుద్యోగులు కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని అం దించాలనే ఉద్దేశంతో ఏఐ కెరీర్స్, కంప్యూటర్ విజన్, ఐటి రోడ్ మ్యాప్, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును ఫౌండేషన్ ఉచితంగా నిర్వహించింది.

ఏఐ రంగ నిపుణులు పునిత్ శర్మ, రంజిత్ చిన్నపల్లి, బండి ప్రవీన్కుమార్లు ఏఐ రంగంలో వస్తున్న మార్పు లు, అవకాశాలను వివరించారు.  వరంగల్ యువతకు, విద్యార్థుల కోసం కంప్యూటర్ విద్యను అందిస్తున్న గంట రవికుమార్.. నూ తన టెక్నాలజీని సైతం ఇక్కడి యువత  విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా, ఏఐ టెక్నాలజీని అం దించి విద్యార్థుల నైపుణ్యానికి దోహదపడాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించి రాను న్న రోజుల్లో ఉద్యోగ అవకాశాల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ గంట రవికుమార్, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.