పే స్కేల్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు
ఏ.పి.ఓ యస్ నాగేష్
మోతె, ఆగస్టు 4: పే స్కెల్ అమలు చేసే వరకు మా పోరాటం ఆగదని ఏ పి ఓ యస్. నాగేష్ అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలో వి బి జి రామ్ జి ఉపాధి హామీ కా ర్యాలయం ముందు నిరసన చేస్తూ అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హా మీ పథకంలో గడిసిన ఇరవై సంవత్సరాలు గా పని చేస్తున్న మాకు పనికి తగ్గ వేతనం గుర్తింపు దక్కడం లేదని అన్నారు.
గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో పే స్కెల్ ప్రకటించిందని నాటి నుంచి ఈ ప్రభుత్వం పే స్కెల్ అమలు చేయడం లేదని చెప్పారు. గత వారం రోజులు గా పెన్ డౌన్ షట్ డౌన్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ మంత్రి స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇ సి ఇ. శ్రీహరి, టి ఏ లు బి. ఉమ్లా నాయక్, వి. సురేష్, సి హెచ్ రామయ్య, సి ఓ లు వై. శ్రీనివాస్, జె. మాల్సుర్ తదితరులు పాల్గొన్నారు.






