ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఇతర రాష్ట్ర అధికారులు
కొండపాక, ఫిబ్రవరి 26: కొండపాక మండలం రాంపల్లి, మర్పడగ గ్రామాలలో ఉపాధి హామీ పనులను చూసి సంతోషం వ్యక్తం చేసిన మహారాష్ట్ర, లడక్ రాష్ట్రాలకు చెందిన అధికారులు. ఈ సందర్భంగా గురువారం మహారాష్ట్ర, లడక్ రాష్ట్రాలకు చెందిన అధికారులు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లోని మర్పడగా, రాంపల్లి గ్రామాలలో ఉపాధి హామీ పనులలో చేపట్టిన పనులు ఫారం ఫండ్, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, ఫీడర్ ఛానల్, నర్సరీ, ఆయిల్ ఫామ్ ప్లాంటేష న్, కమ్యూనిటీ గొర్ల షెడ్డు, రైతు వేదిక పనులను సందర్శించి, సంతోషం వ్యక్తం చేశారు.
టీం లీ డర్లు దిగంబర్, సోనాల్ మొబర్రాయ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్డీ నుంచి వచ్చిన అధికారులు ఎంపీడీవో, ఈసీ, ప్లాంటేషన్ మేనేజర్, డిటిసి టెక్నికల్ అసి స్టెం ట్లు, ఎస్ బి ఎం కోఆర్డినేటర్ చెన్నారెడ్డి, మర్పడగ సర్పంచి బాలరాజు, రాంపల్లి సర్పంచ్ బొమ్మ మల్లయ్య రెండు గ్రామ పంచాయతీల కార్యదర్శి లు,వార్డు సభ్యులుఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.




