విభాగాల సమన్వయంతోనే సంస్థ ప్రగతి
మందమర్రి ఏరియా జీ.ఎం ఎన్. రాధాకృష్ణ
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి అన్ని విభాగాలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (G.M) ఎన్. రాధాకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్ (సిబ్బంది), అకౌంట్స్, సివిల్ విభాగాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆయా విభాగాల వారీగా జరుగుతున్న పనులు, సాధించిన పురోగతిపై జీ.ఎం గారు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
"సింగరేణి ప్రగతిలో ప్రతి విభాగం ఒక కీలకమైనదని, అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మందమర్రి ఏరియాను అగ్రగామిగా నిలపాలనన్నారు. ఈ సమీక్షా సమావేశంలో AGM (F&A) RVSRK ప్రసాద్, DGM పర్సనల్ CH.అశోక్, DGM IED కిరణ్ కుమార్, సివిల్ S.E శ్రీధర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, అన్ని గనుల సంక్షేమ అధికారులు, సివిల్ అధికారులు, అకౌంట్స్ అధికారులు పాల్గొన్నారు.






