28 May, 2026 | 7:01 PM

బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు పోచారం, ఆగ్రో చైర్మన్ కాసుల

28-05-2026 05:38 PM

బాన్సువాడ, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈదుగా వద్ద గురువారం బక్రీద్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ ఈద్ ముభారక్ ( బక్రీద్  పండుగ శుభాకాంక్షలు )  ప్రభుత్వ  వ్యవసాయ  సలహాదారులు  పోచారం  శ్రీనివాస్  రెడ్డి గారు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు తెలిపారు.ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ  మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.