13 May, 2026 | 1:13 AM

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

13-05-2026 12:06 AM

నేడే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

సంగారెడ్డి, మే 12: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా కోర్సు లతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లమా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్-2026 పరీక్షకు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. జానకి దేవి తెలిపారు.

ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. సంగారెడ్డి పట్టణం మరియు జోగిపేట్లో ఏర్పాటు చేసిన మొత్తం 6 పరీక్ష కేంద్రాలలో 2,068 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.

సంగారెడ్డిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల (మహిళ), సెయింట్ ఆంథోనీ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల), ఎస్.వి. జూనియర్ కా లేజ్, రాజంపేట రోడ్, ప్రభుత్వ హై స్కూల్ ఫర్ బాయ్స్, శివంపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9:30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. ఉదయం 10:00 గంటల నుండి మాత్రమే పరీక్ష కేంద్రాలలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.