14 August, 2026 | 3:12 AM

అవయవదానం పునర్జన్మతో సమానం

14-08-2026 01:02 AM

అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.కుమారస్వామి 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 13: మరణానంతరం చేసే అవయవ దానం మరో జన్మతో సమానమని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.కుమారస్వామి అన్నారు. గురువారం అవయవ దానం దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట జిల్లా చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ ఆదేశానుసారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన లీగల్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అవయవ దానానికి సంబంధించిన చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు.

’ఎన్వోటీటీవో’ అనే పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే అవయవ దానం చేయడానికి అర్హులని సూచించారు. అవయవదానంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచు కొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ, అవయవ దానం చేయడం ద్వారా మరొక మనిషికి పునర్జన్మని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు మరణానంతరం తమ అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్ ఎం.రవికుమార్, వన్ టౌన్ ఎస్‌ఐ నర్సింలు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.