11 May, 2026 | 11:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

సమర్థవంతమైన అభ్యర్థులకు అవకాశం

24-01-2026 09:41 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసి ప్రజల అభివృద్ధిని కోరే ప్రతి కార్యకర్తకు పార్టీ టికెట్ దక్కుతుందని డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం కానాపూర్ నిర్మల్ బైంసా మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ల కోసం ఆశావాదులు ఎక్కువగా ఉన్నారని అందర్నీ సమన్వయం చేసుకొని ప్రజల ద్వారా నిర్వహించిన సర్వేలో ఉన్న వ్యక్తులకి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక కుటుంబానికి ఒకే పదవి ఉంటుందని రాజకీయ పైరవీలకు అవకాశం లేదని తెలిపారు. టికెట్ల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పార్టీ నాయకులు ఇంద్రకాలా రెడ్డి నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి శ్రీహరి రావు తదితరులు ఉన్నారు.