18 April, 2026 | 4:33 PM

ఆండాలమ్మ వారికి ఊంజల్ సేవ

18-04-2026 12:38 AM

స్వామివారి నిత్య రాబడి రూ.9,82,918

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 17 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిత్య పూజలతో ఊంజల్ సేవ మహోత్సవం జరిగింది. శుక్రవారం స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఊంజల్ సేవ పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల పూలతో, తులసి దళాలతో, ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి అర్చక స్వాములు హారతినిస్తూ కీర్తన చేశారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల సన్నాయి మేళం నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అమ్మవారి ఊంజల్ సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉదయం ఆలయంలో నిత్యారాదరణ అనంతరం స్వామివారి కళ్యాణం హోమాన్ని అర్చకులు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. స్వామి వారి నిత్య రాబడి 9,82,918 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వివిధ శాఖల నుండి వచ్చిన ఆదాయం 9,82,918 వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.