కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
- లేదంటే ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం
- మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
మహబూబాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికు లకే ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ మంత్రి హీరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం కాజీపేటలో నిర్వహించిన కొలువుల కొట్లాట మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక నిరుద్యోగ యువతకు కోచ్ ఫ్యాక్టరీలో అవకాశం ఇవ్వకపోతే ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే కాజీపేటకు ఈ కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడ పరిశ్రమలు రావాలని ముఖ్యం గా మన స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు దొరకాలని మనం కోరుకున్నామని, కానీ ఈరోజు ఫ్యాక్టరీ వచ్చినా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యా యం చేస్తోందని ఆరోపించారు. ఆనా డు దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేద న్న బీజేపీ ప్రభుత్వం, ఆ తర్వాత అస్సాం, లాతూర్ మహారాష్ట్రలలో కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసి తెలంగాణకు మాత్రం మొం డిచేయి చూపిందన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. అస లు ఇప్పుడు ఇక్కడ కడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేక కోచ్ ఫ్యాక్టరీనా? స్పష్టతనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లు తెలంగాణకు చేస్తున్న నిర్వాకం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
భూము లు ఇచ్చిన నిర్వాసితులకు, స్థానికులకు లాతూర్ తరహాలో 70 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ప్రారంభోత్సవానికి వస్తే.. ఎక్కడికక్కడ అడ్డుకుంటాం బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిలదీస్తాం అని ఆయన హెచ్చరించారు. కాజీపేట జంక్షన్ ను రైల్వే జోన్ గా ఎందుకు చేయించడం లేదన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. నిరుద్యోగ యువత పక్షాన చేపట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
భూభారతి కాదు.. భూ‘హారతి’
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి రైతులకు మేలు చేయడం లేదని, అది భూ ‘హారతి’గా మారిందని, భూభారతి పేరుతో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చి అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. భూభారతిపై ‘సిట్’ వేసి అక్రమాలపై దర్యాప్తు చేపట్టా లన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రం లో నిర్వహించిన బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ, రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు ఉండవా అంటూ ప్రశ్నించారు. భూభారతిలో ఇటీవల వెలుగు చూసిన అవకతవ కలను మీసేవ నిర్వాహకులు, కంప్యూటర్ ఆపరేటర్ల పై నెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
భూభారతి అక్రమాలపై సిట్ చేత విచారణ జరిపించాలన్నారు. సాదా బై నామాల పై పెట్టిన అఫీడవిట్ నిబంధన ఎత్తివేయాలని కోరారు. భూభారతితో కోటి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో చేర్చి అక్రమాలకు తెర లేపారని ఆరోపించారు. ఏపీకి నీళ్ల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్‌కు తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరించారు.




