23 April, 2026 | 5:46 PM

పెహల్గాం ఉగ్ర దాడికి ఏడాది

23-04-2026 12:00 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౨: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి బుధవారంతో ఏడాది పూర్తయింది. గతేడాది ఏప్రిల్ 22న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మతం ఆధారంగా పర్యాటకులను వేరు చేసి, వారి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

ఈ దాడికి స్పందనగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలను తుత్తునియలు చేసింది. అనంతరం ‘ఆపరేషన్ మహాదేవ్’ చేపట్టి 93 రోజులపాటు అలుపెరగని డ్రైవ్ నిర్వహించి, దాడికి పాల్పడిన ముగ్గురు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

ఉగ్రవాదుల కుట్రలు సాగవు: మోదీ

పెహల్గాం దాడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మృతులను స్మరిస్తూ నివాళులర్పించారు. భారత్ ఎప్పటికీ ఏ రకమైన ఉగ్రవాదానికీ తలవంచబోద ని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఇప్పటికీ ఉక్కుసంకల్పంతోనే ఉందన్నారు.