calender_icon.png 19 February, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలి

19-02-2026 01:08:57 AM

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఆకట్టుకున్న బంజారాల సంప్రదాయ నృత్యాలు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎం పీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అనిల్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి, మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు బంజారా సమాజ్ పెద్దలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ముందుగా సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజ లు నిర్వహించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు బంజారా నాయక్ పుస్తకా న్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా బంజారా మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. బం జారాల విన్నపం మేరకు పట్టణంలో సేవాలా ల్ చౌక్ ఏర్పాటుపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. యువ త కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచిం చారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బంజారా భవన్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు.

గిరిజనుల కుల ధ్రువీకరణ పత్రాలు, అటవీ భూముల హక్కు ల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని చెప్పారు. జయంతి కార్యక్రమానికి మారుమూ ల తండాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, గ్రీవెన్స్ కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గిరిజన ప్రాం తాల్లో విద్య, వైద్య సేవల మెరుగుదలకు ప్రత్యే క చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ ద్వారా చర్యలు చెప్పాడుతాం అన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాల జారీకి  చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, పలువురు అధికారులు, బంజారా సంఘాల ప్రతినిధులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.