23 May, 2026 | 4:27 AM

నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి

23-05-2026 12:04 AM

గట్టు, మే 22: నాణ్యమైన విత్తన ఎంపిక చేసుకోని సేంద్రీయ పద్ధతులతో వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని శాస్త్రవేత్తలు డాక్టర్. శంకర్,శ్రీరామ్ లు  రైతులకు సూచించారు.ఈ మేరకు శుక్రవారం గట్టు మండలంలోని అరగిద్ద గ్రామంలో ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు  మాట్లాడుతూ ...

పంటలకు తక్కువ యూరియా వాడాలని దాని వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పత్తి లో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నష్టం యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను పండించడం వలన అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం ఇచ్చే బోనస్ కూడా పొందవచ్చని నాణ్యమైన విత్తన ఎంపిక చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ తిరుపలేష్ ,గ్రామ సర్పంచ్ బాలకృష్ణ,  ఉప సర్పంచ్ తదితరులు  పాల్గొన్నారు.