సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ను బొందపెడుదాం
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, జూన్ 21 (విజయక్రాంతి): త్వరలో జరిగే సిద్దిపేట మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మునిసిపల్ ఎన్నికలతోనే బిఆరెస్ పార్టీని సిద్దిపేటలో బొండపెట్టడం ఖాయమని చెప్పారు. వారంలో మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, 43 వార్డులలో జెండా పండగ నిర్వహిస్తామని చెప్పారు.
సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం అందరం కలిసి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేద్దామని కోరారు. ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మెయిన్ రోడ్లు తప్ప వార్డులు కాలనీలు అభివృద్ధి చేసిన పాపాన పోలేదని, వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో సిద్ధిపేటకు పట్టిన శని వదిలేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మైనార్టీ అధ్యక్షులు రషద్. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్, నాయకులు రాజు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.






