27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

09-06-2026 12:48 AM

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని, సేంద్రీయ విధానాన్ని అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  కార్యాలయంలో రైతులకు హరిత ఎరువు (జీలుగ) విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం బయ్యారం మండలంలోని బాలాజీపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని రైతులకు పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, నకిలీ విత్తనాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, యూరియా వినియోగాన్ని తగ్గించడం, నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పచ్చి రొట్ట పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రైతులకుజీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.