16 May, 2026 | 2:15 AM

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలి

16-05-2026 01:27 AM

గద్వాల టౌన్ మే 15: గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలు పత్రికలను విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ప్రణాళికాబద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.విద్యా వారోత్సవాల్లో భాగంగా లైబ్రరీ డే సందర్భంగా శుక్రవారం గద్వాల జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.

అనంతరం గ్రంథాలయంలోని విభాగాలను పరిశీలించి విద్యార్థులు ఉద్యోగార్థులకు అవసరమైన ఆధునిక పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.గ్రూప్స్,బ్యాంకింగ్,టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఒకే నోటిఫికేష్ప ఆధారపడకుండా ఇతర ఉద్యోగ అవకాశాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు,డీఈవో విజయలక్ష్మి,లైబ్రేరియన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.