రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఎస్ఐ ఆంజనేయులు
భిక్కనూర్,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... పట్టణానికి చెందిన గడ్డమీది చంద్రం (43) కంటైనర్ లారీ ఢీకొనడంతో మృతి చెందాడు.
దాబా హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న చంద్రం ఆదివారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం బస్వాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ చంద్రాన్ని అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.




