14 July, 2026 | 6:57 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఒకరికి తీవ్ర గాయాలు

10-10-2025 11:34 PM

నకిరేకల్,(విజయక్రాంతి): హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైక్  పై ఇద్దరు వెళ్తుండగా  వెనక నుండి లారీ ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా ఒకరికి  తీవ్రగాయలు అయినా సంఘటన నకిరేకల్ బైపాస్ పద్మా నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి యానాల విక్రమ్ రెడ్డి నకిరేకల్ పట్టణానికి చెందిన రావుల ప్రభు ఇద్దరు కలిసి బైక్ పై నగేష్ హోటల్ నుండి నకిరేకల్ కు వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్  చేస్తుండగా లారీ ట్యాంకర్ బైక్ ను వెనుక నుండి ఢీకొనడంతో యానాల విక్రమ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు . రావుల ప్రభు తీవ్ర గాయాలు కావడంతో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స  అందించారు. మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.